ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

99


వంచనగా మాటలాడుచున్నదని యెంచి, 'నేను బిడ్డ యొక్క తండ్రినిగూర్చి యడుగ లేదు. దానితల్లిని గుఱించి యడిగితి' ననెను.

నిమాయి, ఉచిత మైన శాంతిని బొంది, అప్రతిభురాలై యేవరి శిశువో నే నేమెఱుంగుదును. అన్న యెక్కడనో పడి యుండినదానిని ఎత్తుకొని వచ్చెను. ఈశిశువు సమాచారము నడిగి తెలిసికొనుట కవకాశము లేకపోయేను. ఇపుడు క్షామ కాలము. ఎందఱో బిడ్డ పాపలను దారిలోఁ బాఱవైచి పోయెదరు. మనయొద్ద కెందఱో తల్లులు బిడ్డల నమ్ముటకై వచ్చి యుండిరి కదా. ఇతరుల బిడ్డల నెవరు కొనెదరు? (అప్పుడామె నేత్రములు జలపూరితము లాయెను. నిమాయి కన్నీరు తుడుచుకోని మరల) శిశువేమో దివ్యసుందరమైనది. దీని చక్కఁదనమును జూచి, అన్న నడిగి తీసికోంటి' ననియె.

ఆపిమ్మట వారిరువునును బెద్దప్రొద్దు ఏమేమో ఆమాట యీమాట లాడుచుండిరి. కోంత సేపటికి నిమాయి భర్త యింటికి వచ్చినాఁడు. కనుక శాంతి లేచి తనకుటీరమునకుఁబోయి, తలుఫు వేసికొని, ప్రొయ్యి నుండి కొంచెము బూడిదను బైటత్రొసి యుంచెను. మిగిలినబూడిదపై తనకై వండి యున్న యన్నమును పాఱవైచి, నిలచినది నిలచినట్లే కొంతసేపు చింతించి, తనలోఁ దానే “యిన్ని దినంబులుగాఁ జేయవలయు ననుకొన్న దాని నీ దినము చేసి వేయుదును, ఏయాశచే నిదివఱకుఁ జేయకుంటినో యది సఫల మాయెను. సఫలమో; నిష్ఫలమో, నిష్ఫలము ! ఈజీవనమే నిష్ఫలము, ఏమి సంకల్పము చేసి యుంటినో, దానిని