ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఆనందమఠము


దఱును పరాజితులై మ్లానముఖులై నగరంబును విడిచి, అచట నుండి మరలి కాననమునకుఁ బోయి చేరిరి.


పందొమ్మిదవ ప్రకరణము

శాంతి సన్న్యాసి యగుట

జీవానందుఁడు వెడలిపోయిన పిదప, శాంతి, నిమాయిమణి యింటి యరుగుపై కూర్చుండెను, నిమాయిమణి శిశువును తొడపై నిడుకొని గూర్చుండెను. శాంతి నేత్ర జలంబులం దుడిచికొని యుండిన దేగాక ముఖము ప్రఫుల్లముగ నుండెను. కొంచెము కొంచెము నవ్వుచు నుండెను. గంభీరముగను, చింతా యుక్తముగను, ఆన్యమనస్కురాలుగను నుండెను. నిమాయి 'చూచితివా ' యనెను.

శాంతి ఉత్తర మియ్యక యూరకుండెను. నిమాయి, శాంతి తనమనో భావములు వెల్లడి చేయదని భావించికొని, ప్రయత్నపురస్సరముగా ఏవేవో ముచ్చటలాడి, 'చూడవేవదినే! ఇది యెంతటిబిడ్డనే!” అనెను.

శాంతి—— ఈబిడ్డ నీ కెక్కడ దొరకెను? నీ వెపుడు కంటివి?

నిమాయి——నీవుపాడైతివి, ఇది మాయన్న బిడ్డకదా !

నిమాయి, శాంతి యొక్క కడుపు మండించుట కీమాటఁ జెప్ప లేదు. అన్న బిడ్డయనఁగా అన్న యిచ్చిన బిడ్డ యని చెప్పుట కట్లు చెప్పెను, శాంతి యీయర్థమును గ్రహింపక, నిమాయి