ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

97


కారబంధురంబగు రాత్రి కాలంబున నగరాభిముఖులై చనిరి, శస్త్రంబుల మర్మరశబ్దంబును, అస్త్రంబుల ఝణఝణశబ్దంబును, కంఠములయస్ఫుటనినాదంబుసు, మధ్యమధ్య గోవిందాది నామస్మరణ ధ్వనులును మ్రోగుచుండెను. నిదానముగను గంభీరముగను రోషయుక్తముగను తేజస్సహితంబునను ఆసంతాన వాహిని నగరంబును బ్రవేశించెను. ఇట్లాకస్మికంబగు నీకోలాహలంబును గాంచి నగరవాసులు భయపడి యెక్కడికో పలాయనమై పోయిరి. వారి పోకడయే తెలియ లేదు. నగరరక్షకులు హతబద్ధులై నిశ్చేష్టితులై యుండిరి.

ఇచట, సంతాను లందఱును మొట్ట మొదట కారాగృహంబునకుఁ బోయి తలుపులను విఱుగఁ గొట్టి రక్షకులను తన్ని, సత్యానందుని మహేంద్రుని విడిపించి, శిరమునం దిడికొని నృత్యంబు చేయ నారంభించిరి. గోవిందశబ్దము విశేష మాయెను, సత్యానంద మహేంద్రుల విముక్త్యనంతరము కనఁబడిన యవనుల గృహంబు లన్నిటిని తగులఁ బెట్టుచుండిరి. అయినను, ఆపని యందు చాల కాలము గడువ లేదు. ఇంతలో నగర మేలెడు రాజగు అసదుల్ జమానుఁడు నగరంబునందున్న సైన్యంబును గుమి గూర్చికొని ఫిరంగి,తుపాకి, మొదలగు సాధనంబులతో సంతాన సంప్రదాయస్థుల నెదిరించెను. సంతానుల ఆయుధములు ఖడ్గములును బల్లెములే యగుటవలన, ఫిరంగిగుండ్లను జూచి కొంచెము భీతిల్లిరి. ఫిరంగిగుండ్ల దెబ్బలకు సంతాను లనేకులు చచ్చిరి. అపుడు సత్యానందుఁడు వెనుదిరిగి చూచి 'వృథా వైష్ణవ వధచేఁ బ్రయోజనము లే ' దనెను. అంత సంతానులం