ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఆనందమఠము


ఎవఁడు రణంబునందు జయదాతయో;మన మట్టిమహానుభావుని యుపాసకులము, అతని కృపచే మన బాహువులయం దమిత బల మున్నది. ఆతఁ డిచ్ఛామాత్రుఁడై యున్నాడు. అతని సత్సంకల్పముచే మనకు రణంబున జయంబు గలుగును పదండి, ఆయవనపురంబును పాడు చేసి' కాల్చి భస్మ రాశిగాఁ జేయుదము. ఆక్రూరుల నివాసంబు నగ్ని సంస్కారంబు చేసి, ఆజయనదీ జలంబులయందు గలిపి వత్తము చెప్పుఁడు.. “హరే మురారే మధు కైటభారే” అని.

ఆసమయంబున కాననమునుండి యతి భీషణం బగుధ్వనిచే సహస్ర సహస్రకంఠము లేకమై“హరే మురారే మధుకైట భారే” యని, ధ్వనిత మాయెను. వేలకొలఁది ఖడ్గంబు లొక్కతూరిగా ఝణత్కారశబ్దము లిచ్చెను. వేలకొలఁది బల్లెములు పై కెత్తఁబడెను. 'వేలకొలఁది జనుల భుజాస్ఫాలనశబ్దము వజ్ర నినాదమై చెలంగెను. వేలకొలఁది భిండి వాలంబులును మసల ముద్గరంబులును కర్కశము లగుకుంతములును ఒక దానితో నొకటి యొరసికొనుటనలనఁ గలిగిన శబ్దము భీషణముగా నుండెను. ఈ మహా కోలాహలంబున కోర్వక వన్యమృగంబులు కాననంబును విడిచి పాఱిపోయెను. పక్షులు భయంబున ఉచ్చనాదము చేయుచు నెగిరినందున గగనంబు చీఁకటి కమ్మెను. అపుడు నూర్లకోలఁది జయ భేరులు మ్రోగెను. “హరే మురారే మధుకైటభారే” యనుచు కాననమునుండి శ్రేణీ బద్ధులై సంతానులు తండతండములుగా బయలు దేరిరి. నెమ్మదిగా పోవుచుండిరి. నిదానముగను గంభీరముగను పదవి క్షేపము చేయుచు గట్టిగా హరినామంబుల నుడువుచు నాయంధ