ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

95


నిల్చి ఖడ్గంబును జళిపించుచు ఉచ్చస్వరమున, మన మనేకదినములనుండి సుఖజీవనమునే స్వాభావికముగా ననుభవించు చుంటిమి. ఇపుడు అజగరవ్రతమును విడిచి యీ యవనపురిని ధూళీపటము గావించి అజయనదీజలంబునఁ గలపి వేయవలయు ననియును, ఈపందుల గుంపును నిప్పు పెట్టి కాల్చి వేసి మాతయగు వసుమతిని మరల పవిత్రురాలుగా నొనరింపవలయుననియును, సంకల్పము గలవారమై యున్నారము, మీరు వినుఁడు; నేఁడు ఆదినము ప్రాప్తమైనది. ఎవరు మనగురువునకు గురువులైన పరమగురువులై యున్నారో; ఎవ రనంత జ్ఞానమయులై యున్నారో; ఎవరు సర్వదా శుద్ధాచారము గలవారై యున్నారో; ఎవరు లోకహితైషులై యున్నారో; ఎవరు దేశహితైషులై యున్నారో; ఎవరు మన సనాతనధర్మమును మరల నెలకొల్పుటకై స్వశరీరము నర్పించు ప్రతిజ్ఞ గలవారై యున్నారో;ఎవరిని మనము సాక్షాద్విష్ణుస్వరూపావతార మని యెంచి యున్నారమో; ఎవరిని మన ముక్తికి ఉపాయభూతులని యెన్ని నారమో; యట్టివారు నేఁడు మ్లేచ్ఛుల కారాగృహమున ఖైదిగా నున్నారు. మన ఖడ్గంబులయందు వాఁడి లేదా ! అని చెప్పి తన ఱోమ్ము తట్టి మరలఁ జెప్పెను. మన హృదయంబున ధైర్య సాహసములు లేవా ! భ్రాతృలారా! చెప్పుఁడు— "హరే మురారే మధు కైటభారే" సోదరులారా!ఎవఁడు మధు కైటభులను నాశ మొందించెనో; ఎవడు హిరణ్యకశిపుని, దంతవక్రుని, శిశుపొలాది దుర్జయులైన అసురులను నిధనసాధనము జేసెనో, ఎవని చక్రాయుధ ఘఘోర నిషముచే మృత్యుంజయుఁ డగు శంకరుఁడు సహితము భీతిల్లి యుండెనో, ఎవఁ డజయ్యుఁడో;