పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

TELUGU PROVERBS--SUPPLEMENT.

2223. ఎద్దువలె తిని, మొద్దువలె నిద్రపోయినట్టు.

He eats like a bullock, and sleeps like a log.

2224. ఎనుము యీననిది రెడ్డి అంటే, నీకేమి కద్దే బొడ్డీ అన్నాడట.

When she said "O Reddi! your buffaloe has calved." he replied "O Boddi! what's that to you?"

                  The woman wanted some milk.

2225. ఎప్పటి అమ్మకు నిప్పటే గతి.

The woman who always comes gets only a plain cake.

             Nippati is a kind of damper.

2226. ఎముకలేని నాలుక యెట్లా తిప్పినా తిరుగుతుంది.

The boneless tongue turns in anyway.

                       (See No.1237)
                   Said a liar.

He lies as fast as a dog can trot.

2227. ఎరువుల సొమ్ములు యెరువులవారు యెత్తుకొని పొతే, పెండ్లికొడుకు ముఖాన పేడనీళ్ళు చల్లినట్టే వుంటుంది.

When the leaders take back the ornaments lent, it is like sprinkling cowdung water on the face of bridegroom.

                              (See No.1507)

2228. ఎరువు సతము కాదు, వాక్కు తోడు కాదు.

Lent property is not lasting, speech is not help. You cannot always depend upon getting a livelihood by your plasibility.

2229. యెలుక యెంత యేడ్చినా, పిల్లి తన పట్టు వదలదు.

However much the rat may cry, the cat will not let go her hold.

                      (See Nos.405,1457)
                                       (15)