పుట:A Collection of Telugu Proverbs.pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

TELUGU PROVERBS.

346. ఊరకుంటు, అడివిలేడి.

Lame in the village and an antelope in the jungle.
A skulk.

347. ఊరికంతా వకదోవ, వులిపికట్టెకు వకదోవ.

All the village has one way, and the prig another.

348. ఊరికి పొయ్యేవానికి లేకపోయినా, బహిర్భూమికి పొయ్యేవానికి బత్యము కట్టుమన్నట్టు.

Never mind giving provisions to the man setting out on a journey, but supply them to the man going to the rear of the village.

349. ఊరికి వక బోగముది, యెవరివద్ద ఆడును.

There is but one dancing girl in the village; before whom is she to dance?

350. ఊరికి వుపకారముగా ఆలికి కోక కొని పెట్టుతాను, యింటింటికీ డబ్బు యివ్వండి అన్నాడట.

As a public benefaction, I will buy a cloth for my wife; give me a pice from each house.
(See No. 126.)

351. ఊరికె వస్తే మావాడు మరివకడు వున్నాడు.

If they are to be had for nothing, I have a relative here. Wishing to get two shares.
Greediness.

352. ఊరికే వుండలేక పోతే, వురి పెట్టుకో.

If you can’t be quiet, hang yourself.

( 63 )