ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

87

రెండు మూడు మాటలతో నామెను బ్రబోధించి యామె గాయముల పై మంచువైచి బాధానివారణముం గావించెను; అన్న పానాదులచే నామె యాయాసము నడఁగించెను, ఉప గుప్తుని యుపచారములచే నామె త్వరలోనే సుస్వస్థురాలయ్యెను. అప్పుడామె కుటిలవిలప్రద త్తంబగు మదిరారసంబునకును, ముక్తపురుషప్రద త్తంబగు శుద్ధజలంబునకునుగల భేదమును బాగుగ గ్రహించెను; సురభిచందనకుంకుమాద్యంగ రాగములకును, శోణితప్రలేపమునకు నెంత భేదమున్నదియో యామేకప్పటికి బోధపడియెను. మంద భాగ్యురాలగు నామె కిన్నాళ్లకుఁ దెలిసినది! ప్రలుబ్ధులగు నాగరికుల చాటూ క్తులకును, ననాసక్తు డగుభిక్షుని యుప దేశములకు నెంత యంతరమున్నది! ఆనిర్భాగ్యురాలి కిప్పటి కనుభవమునకు వచ్చినది.

దీపమాలాసుశోభితంబగు రాజ మార్గ మధ్యమునఁ గూడ జనులు దిగ్బ్రాంతులై త్రోవ తప్పి పోవుచున్నారు. కాని విజనారణ్యమున నర్ధరాత్రమున మేఘాంధ కారమధ్యమున క్షణప్రభయగు విద్యుత్ప్రకాశము చేతనే విహ్వల చిత్తులగుపథికులు తమ మార్గమును గనుఁగొనఁగలుగు చున్నారు. మందభాగ్యురాలగు నాయువతి యదృష్టము కూడ నీవిధముగా ఘటిల్లినది. ఆ మూఢురాలు సుఖసౌందరైశ్వర్యప్రభలలో నెట్టిగతికిఁ బోవలయునో యింత కాలము వఱకుఁ గనుఁగొనఁజాలక పోయెను. కాని యిప్పుడామె తన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/95&oldid=334886" నుండి వెలికితీశారు