ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

అ శో కుఁ డు

గిరిరాజదుహిత యగు గంగయు, వింధ్యాచల సుతుం డగు హిరణ్య బాహువు,(శోణనదము)ను గలసికొన్న రమణీయ స్థానమునఁ బాటలీపుత్రనగరము నిర్మింపబడియెను. శత్రువులకు దుర్భేద్యముగ నుండుటకును, రాజ్యము విస్తరించుటకును, నగరశోభ యతిశయించుటకును, నాగరకుల సౌకర్య మునకును, వాణిజ్యము వర్ధిల్లుటకునుగూడ నీ నదీనదసంగమ స్థానము సర్వవిధముల ననురూపమైనదని నిరూపింపబడియెను. చంద్రగుప్తుని రాజ్య కాలమునుండియుఁ బాటలీపుత్రనామము దేశవిదేశములఁ బ్రఖ్యాతినందఁదొడంగెను. ఆ కాలమునందుఁ బాటలీపుత్రము గంగా శోణసంగమస్థానమున శోణనదమున కుత్తర తీరమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. కాలవశమున నిప్పటికా పాటలీపుత్రనగర చిహ్నముకూడ మన కగపడుట లేదు. ఉన్నను మనకది దుర్బోధ్యము—

చంద్రగుప్తసార్వభౌముని కాలమునఁ బాటలీపుత్రసౌందర్య సమృద్ధుల కవధియే లేక యుఁడెను. చంద్రగుప్తుని రాజప్రాసాదము దారునిర్మిత మైనది. ప్రాసాద ప్రాచీరములును స్తంభములును సమస్తమును గూడ రమణీయదారునిర్మితము లేయైయుండెను. గృహ స్తంభము లన్ని య ను సువర్ణ రజత ద్రవములతోఁ జిత్రరూపమునఁ బూఁతలు పెట్టబడియుండెను. విశాలాయతరమణీయో ద్యానమధ్యమునందా రాజమందిరము నిర్మింపఁబడుటచే దాని శోభాసౌందర్యములు శతగుణాధిక విలసితములై యుండెను. ఆ విశాల ప్రాంగణ మధ్యమునం

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/20&oldid=333015" నుండి వెలికితీశారు