ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము


పాటలీపుత్ర యాత్ర

బ్రాహ్మణుఁడు తన భార్యతోఁ బాటలీపుత్రమునకుఁ బోయెదనని చెప్పినతరువాత నందులకుఁ దగిన ప్రయత్నములను జేయ నారంభించెను.

అది వేసవి కాలము.— వై శాఖ మాసము - సుడిగాళ్లు వీచుదినములు. నౌకాయాత్ర కది నుంచి సమయము కాదు. ఇంతేకాక విదేశమునకుఁ బోవలసి వచ్చినచోఁ బ్రయాణ వ్యయమునకును గృహ వ్యయమునకునుగూడ ధనము కావలయును. ఎట్లో యన్నీయును సమకూర్చుకొనుట కా బ్రాహ్మణున కించుక యాలస్యమయ్యెను. ఆ చంపక నగరము నందలి దయాళుఁడగు నోక వర్తకుఁ డాతనికి దగిన సాహాయ్యము చేసెదనని మాటయిచ్చెను. అశ్విజమాసమునం దావర్తకుని పెద్ద యోడ యొకటి వాణిజ్యవస్తువులు దీసికొని పాటలీపుత్రమునకుఁ బోవలసియుండెను. భాహ్మణుఁడు తన కుమారైందీసికొని యా యోడ పై నెక్కి పోవుటకు స్థిరపరచు కొనియెను.

క్రమముగ వర్షాకాలము వచ్చెను. నదీనదములు జల ప్రపూర్ణము లయ్యెను. చంపావతీనది చిన్నదియే యయ్యు నిప్పుడుభయకూలముల నోఱసి ప్రవహించుచుండెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/18&oldid=349775" నుండి వెలికితీశారు