ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

125

దృప్తి వహించి యుండ లేదు. ఆతఁడు తన ప్రజలయాముష్మిక సుఖంబునకై యుపయోగపడు ధర్మము, నీతి మొదలగు వాని రక్షణమున కై కావలసిన కార్యముల నన్నిటిని జేసెను. ఆతఁడు తన ప్రజలలో బౌద్ధధర్మానుష్టాన మెంత నియమముగ నడచుచున్నదో పరీక్షించుటకు ధర్మోద్యొగులను గొండఱను నియోగించియుండెను. యూరపు ఖండమునందలి క్రీస్తు రాజ్య ములలో మత ప్రవర్తనమునకై ప్రత్యేక కార్యనిర్వాహకులు నియమింపఁబడి యుందురు. ఇంగ్లీషు రాజ్యమునందట్టి పనికై ఆర్చిబిషప్, చ్యాపలేన్ మొదలగువా రున్నట్లు మనకుఁ దెలియ వచ్చుచున్నది. ఇట్టివారు గూడ రాజ్య పాలనోద్యోగ విభాగములయం దొకతరగతి విభాగోద్యోగులై యున్నారు. వీరు క్రీసుప్రజల లోని మతాచారముల యనుష్టానములం గూర్చి విచారణ చేయుచుందుకు. మహారాజగు నశోకుని రాజ్యమునందు గూడ నిట్టి యేర్పాటులున్నవి. ధర్మ మహామాత్రుఁడు సైర్య మహామాత్రుఁడు, కర్మికుఁడు మొదలగు కర్మచారుల వ్రాఁతలను బట్టి యిప్పటికిని ధర్మశోకుని రాజ్యపాలనేతిహసమును మనము సంపూర్ణముగ గ్రహింపవచ్చును.

బౌద్ధధర్మమున జాతి భేదము లేకుండుటచే సర్వ దేశముల యందును, సర్వ జనుల యందు నీ మతము వ్యాపించుట కవకాశము కలిగెను. మహా రాజగు నశోకుఁడు బుద్ధ దేవుని ధర్మమును నాతని శాంత్యుప దేశములను సర్వత్ర వ్యాపింప