ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

అ శో కుఁ డు

విభ్రమములకుఁ గూడ నభావము లేము, నాగరిక జనులలో సామాజిక శాసన మెంతవఱకుఁ బ్రాబల్యమును వహించి యుండెనో బాగుగఁ దెలియవచ్చుట లేదు. కాని మానవప్రకృతులను బట్టి యాలోచింపఁగా నప్పటి పల్లెలయందలి వారి కంటె నగరవాస్తవ్యుల స్థితి సర్వవిధముల మించియే యుండవలయునని తోఁచుచున్నది. ఇప్పటి నగర స్వాస్థ్యసౌకర్యములు మ్యునిసిపాలిటీ వారి చేతులయం దున్నల్లే యప్పటి నగర శాసనము కూడ నిర్దిష్ట సంఖ్యాకు లగు ప్రజల హస్తముల యందుండెను. ముప్పదిమంది పెద్దమనుష్యలతో నట్టి సభ ఏర్పరుపఁబడియుండెడిది. వీరిలో నై దైదుగురిని తీసి యాఱు శాఖా సమితులుగా విభజింపఁబడుచుండెను. ఈ సమితులన్నియును వేఱు వేఱుగ నగరమునందలి వేఱు వేఱు భాగముల కార్యములఁ దీర్చుచుండెను. శిల్పము, వాణిజ్యము మొదలగు సకల కార్యములు నీసమితుల మూలమున నే ప్రచారితము లగు చుండెను, సరకుల యెగుమతి దిగుమతులు, పన్నులు, కొలతలు, తూనికలు మొదలగువాని లెక్కలును, గృహములు, జననములు, మరణములు మొదలగు వాని లెక్కలును, విదేశీయులని వాసములు, వారి స్థితిగతులు మొద లగువాని లెక్కలు, వైద్య శాలా స్థాపనములు, ప్రచారములు మొదలగువాని విషయమున నెల్ల విధముల ననుకూలము లగు నేర్పాటులు గావింపఁబడియుండెను.

పల్లెలయందును, నగరములయందును నశోకుని ధర్మ శాసనమున నెట్టికష్టములును లేక జనులు సుఖముగ నివసిం