ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము

119

అశోకుని కాలమందుమాత్ర మిట్టి క్రయవిక్రయ వ్యాపారము దేశవిదేశములయందు జరుపుకొనుటకు సౌకర్యములు లేవు. కేవలము పల్లెలయందు ధనవంతులు లేనే లేరు. ఆ కాలమునఁ గేవలము ధనికుఁడును లేఁడు, దరిద్రుఁడును లేఁడు. గృహస్థులు గోధనము నే మహాధనముగఁ జూచు కొనుచుండెడి వారు. ప్రతి గ్రామమునందును వ్యవసాయము చేయుట కున్నంత భూమితో సమానముగ గోభూమి కూడ నుండెడిది. పల్లెలయందుఁ బశువులు లేని గృహస్థు లెవ్వరును లేరు. సామాన్య కృషికునకై నను కూలిపని చేయుట యవమానకరముగ నుండెడిది. ఆ కాలమునఁ బల్లెలయందు ఋణము లేనివాఁడును, దేశాంతరమునకుఁబోని వాఁడును శాకాన్నభోజియును సుఖజీవనులుగఁ బరిగణింపఁ బడుచుండెడివారు.

చరిత్రమునం దశోక యుగమున స్తాపత్య శిల్పరచన విశేముగ నున్నట్లు కాన వచ్చుచున్నది. అప్పటి స్తూపములును, స్తంభములును, సౌధములు ను గూడ నిప్పుడు భగ్నములై యున్నవి. ఆ భగ్నావ శేషములం గాంచుట చేతనే మనకు మహాశ్చర్యము కలుగుచున్నది. వీనిని బట్టియు, నింకను నగపడుచున్న చిత్రములంబట్టియు, నశోకుని రాజ్యమునందు నగరములలో సుధాధవళింతంబు లగు సుందర సౌధములు విశేషముగ నున్నవని చెప్పుట కెంతనూత్రమును సంశయము లేదు. అప్పుడు నగరములయం డేడంతస్తుల మేడలు కూడ నున్నట్లు తెలియవచ్చుచున్నది. నగరములయందు విలాస