ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలువగవ ప్రకరణము

99

యాకాశి క్షేత్రమును దర్శించునభిలాషతో నచ్చటి వారి పుణ్య చరిత్రములను వినవలయునను కోరికతో భక్తులు విచ్చేసియుండిరి. రాజర్షియగునశోకుఁడును ధర్మాచార్యుఁ డగు నుపగుప్తుఁడును, 'రాజానుచరులును గాశికానగరమును దర్శించిరి. సమీపమునందున్న సారానాథమును దర్శించి కృతాధ్రులమైతి మనుకొనిరి.

అశోక సార్వభౌముని దూర తీర్థయాత్ర సంపూర్ణ మయ్యెను. అంతట వారు కాశి కానగర వాహినియగు గంగా నదియందలి నౌక నారోహించి యథాసమయమునకుఁ బాటలీ పుత్రమునకు వచ్చి చేరిరి. వారి తీర్థ ప్రవాసము సంపూర్ణమయ్యెను.


ఇరువదినాలుగవ ప్రకరణము


పుణ్యప్రభావము

తీర్థయాత్రకుఁ బోయి వచ్చినతరవాత నశోకుని చరిత్రమునందును, నాతని యాచార వ్యవహారాది కార్యములయందును విశిష్టపరిణామమగ పడుచుండెను. తీర్థయాత్రా సమయమునం గలిగిన పుణ్య ప్రసంగ శ్రవణ మాహాత్మ్యమును, పవిత్రవిషయాలోచనముచే లభియించిన పుణ్యప్రభావమును గూడ నాతని ప్రతి కార్యమునందును బింబిత మగుచుండెను.