ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

అడిదము సూరకవి.


ఇట్టి వింతలింకను నీకవిని గూర్చి పెక్కులు చెప్పుదురు గాని యవి యెంతవఱకు. విస్రంభ పాత్రములో చెప్పఁజూలను. ఏదియెట్లున్నను సూరకవికి మాత్ర ము తిట్టుకవిత్వమునబ్రఖ్యాతికలిగి యుండెనని చెప్పుటకు సందియము లేదు.

'గడియకు నూఱుపద్యములు గంటను లేకరచింతు' అను వాక్యమును బట్టి సూరకవికి నాశుకవిత్వమున గొప్పసామర్థ్య ముండెనని మనమూహింపవచ్చును. దేశాటనము' (ఆఱనప ! కగణము) కింద నియ్యఁబడిన వీరఘట్టాము వృత్తాంత మాతని యాశుకవితా సామర్థ్యమును వెల్లడిచేయు చున్నది. ఇంతియ గాక శతసంఖ్యాకములై యాంధ్ర, దేశమున నిలిచి యున్నయీ కవివరుని చాటు పద్యరత్నములు గూడ సద్దానికి సాక్ష్యమిచ్చుచున్న పని నాయభిప్రాయము.