ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.

71

జల్లబొట్టు దొరకదయ్యెను. తానేఁగిన యిండ్లకడఁ బాడియుండియుఁ దనకు వార లీయనందులకు వగచి "దూరమైపోయెరా పొడి ద్వారపూడి "యని యొక శాపవాక్యమును పలికెనఁట. ” దీనికిఁదగినట్టుగ నాఁటిసాయంకాల, మాయైదారెండ్లకడ నావులు గంటెఁడు పాలైన నియ్య లేదఁట ! గృహయజమాను లట్టివింతకు సూరకవి శాపమే కారణమని యెంచి క్షమింపుమని సూరకవి ని వేఁడుకొన యథాప్రకారముగ మఱునాఁటి నుండియునావులు పొలిచ్చు చుండెనఁట ! (ఈవింతను సూరకవి శాపానుగ్రహ ముల "రెంటికిని దార్కా ణముగఁ జెప్పినను జెప్పవచ్చును.) -

3. సూరకవికి 'చీపురుపల్లె 'యందుఁ గొందఱు శిష్యు లుండిరని మూఁడవ ప్రకరణముననే వాసియున్నాను. ఆ విష యమునుఁ దెలియఁజేయుపద్యములోని కడపటి పాదమిట్లున్న ది. “ ధీరుఁడై నిలిచె మురపాక నూరఁడొకఁడు ” ఒక్క మురపాక సూరన మాత్రము తన శిష్యులలో నుత్తముఁడనియు, స్థిరముగ విద్యగరచెననియుఁ గవిగారి యభిప్రాయమై యుండ దైవమా పద్య పాదార్థమును వేఱుగ గ్రహించుటచే మురపాక సూరన్న గారి సోదరులు నలువురలోను సతఁడు మాత్రము మిగిలి తక్కి నవారు స్వర్గస్థులైరట ! (ఈపద్యమును జెప్పుటలోఁ గవియు దేశము జరిగినదానికి భిన్నముగ నుండినను బదములగూర్పుచే నొక విపరీతమగు నర్థము గలిగెననియు దాని పర్యవసానముగనట్లు జరి గెననియుఁ జెప్పుదురు.)