ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

అడిదము సూరకవి.


1. ఒకానొకప్పుడు, ఆళ్ళ సరవయ్య యను పేరుగలయొక కోమటి యింట వివాహముజరిగెను. కవితా సంభావనను గై కొనుటకయి సూరకవి యాకోమటి యింటికిఁబోయి యుండెను. అంత గృహయజమానుఁడు సరవయ్య " బాబూ ! సూరకవి గారూ ! రేపటి యుదయమున దయ చెయ్యండి. కట్నము దాఖలు చేసుకుంటాను. ” అనియెను. సరవయ్య కోరిక చొప్పున మ ఆునాఁటి యుదయమున స్నాన సంధ్యాద్యనుష్ఠానములు నిర్వర్తించుకొని సూరకవి వాని యింటికిఁ బోయెను. "బుద్ది: క ర్మానుసారిణీ ” యనునట్లు సవరయ్య వీణ్ని పాంగర ; బాప నాడు దాచ పెట్టినట్టు పొద్దుటే పౌరొచ్చేడు ”అని సూరకవిని దిట్టెను. ఆపరుషోక్తులు విని సూరన మిగులఁగుపితుఁడై "ఆపామే నిన్నుఁగఱవ అయ్యో సరవా! "అని శపించెను. తిట్టుటయె తడవుగ నొక ' కృష్ణసర్పమింటి ముంజూరు , దూలమునఁ జేయానుకొనియున్న సరవయ్యను బొడిచి విగత పాణుని జేనెను. అట్టి యద్భుతమున కచ్చటనున్న వారందఱు కలవరపడి చేష్టదక్కి యుండిరి. ఆ సర్పము మాత్రమచ్చటనున్న వారల సేవ్వరి నేమియుఁ జేయక తన దారిని బైటకుఁబోయెనఁట !

2. ఒకప్పుడు సూరకవి చీపురుపల్లి నుండి శృంగవరపుకో టకుఁ బోవుచుండెను. మార్గమధ్యముననున్న ద్వారపూడియను గ్రామమునకుఁ బోయి నాలుగైదు యిండ్లకడఁ దాగుటకుమజ్జిగ నడిగెను. అది యెట్టిపాపమో గాని యొట్టుఁ బెట్టినట్టు కవికిఁ