ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

69


, అనితిట్టు కవిత్వమునకుఁ బ్రసిద్ధి కెక్కిన ప్రాచీన కవివరులతో పాటు సూరకవినిఁ గూడఁ బేర్కొని యున్నాడు. శాపానుగ్రహముల రెంటిలోను మొదటి దానికిగల నిదర్శనములు రెండవ దాని కుండినట్టుగ నీకవివరుని జీవితము ననుసరించి చెప్పుటకు నాధారములఁ గానరానందున వేములవాడ భీమకవి మొదలగు పాచీనకవులవలె 'మొకటఁ దిట్టటయుఁ బిదపనను గ్రహించుట యు నీతని పట్ల లేదేమో యని తోఁచెడిని. కాని తపఃప్రభావ : సంపన్ను డగు నీతనికి నట్టి ప్రభావముండిన సుండవచ్చునని " "విచువకను గ్రహించి నిరుపేదనాధిపు తుల్యుఁజేతు" వను .. వాక్యము సందియమును గలిగించుచున్నది. సూరకవి నిండు జవ్వనమున నుండి కవితాసామర్థ్యముచేఁ దనకీర్తి చంద్రి కల దేశమునందు వ్యాపింపఁ జేయుకాలమున నే యడిదము రామకవి : తన వాక్పటిమచే గంగాభవానిని నోడించి యీయడిదము వంశమునకు నొకయద్భుతమగు కీర్తిదెచ్చెను. అట్టికీర్తితి కొలఁది దినములలో నే, కవితావృత్తిచే నెల్లెడలఁ జేరుడయుచున్న సూరకవి నాశ్రయించిన దాయెను. సహజమగు తన సామర్థ్య - మునకునిది తోడుగాఁగ ఇతనికిఁ దిట్టు కవిత్వవిషయమునఁగీర్తి హెచ్చు కాఁజొచ్చెను. వేయేల ! ఆకాలమున సీతని . యెడల జనసామాన్యమునకు భక్తికంటె భయమేయెక్కుడుగనుండెను. సూరకవి తిట్టు కవిత్వముతో సంబంధించిన కొన్ని ముచ్చటల : విచ్చటఁ జెప్పుచున్నాఁడను. .