ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము .

65

సందర్భముననే సూరకవి . పొణుపాటి 'వేంకటమంతి) " అను మకుటముతో - నే పద్య ములను జెప్పియున్నాడు. ఈ పద్యములనే యిటీవల వారెవరో 'యేర్చికూర్చి వానికి - వేంకటమంత్రి శతక మని పేరెడిగాని వాస్తవముగ నయ్యవి కవిచేఁ బ్రస్తావన గఁ జెప్పఁబడిన వేగాని శతకరూపముస రచింపఁబడినవి కావు. ఇందులకుఁ దార్కాణముగఁ గొన్ని పద్యములతో సంబంధించియున్న వింతకథలను నిచట వ్రాయు చున్నాఁడను.


1 ఒక సమయము శృంగవరపుకోట జమీదారులగు శ్రీముఖి కాశీపతిరావు గారి గృహామున నేదియో యొక శుభ కార్యము వైభవముతో జరుగుచుండ సమీపగ్రామములలో నున్న బాహ్మణులు సంభావసలఁ గైకొనుటకు-- శృంగవరపుకోటవచ్చి యుండిరి. సంభోసనలిచ్చుటకుఁ బూర్వము బాహ్మణులందరు దొడ్డిపెట్టిరి. ప్రమాదవశమున సూరకవి కూడ దొడ్డి పెటఁబడి రెండు యామములు మించు వఱకచ్చటనే యుం డవలసి వచ్చెరు. తాను సూరకవి యని పలుమాఱు బంట్రౌతులకు జెప్పి విడు పడన్నను వారితనిని విడువరయిరి. సంభావనల నందుకొను బ్రాహ్మణులతోఁ బాటు. కొంత సేపునకును సూరకవి సంభావన లిచ్చుచున్న వేంకటమంత్రి గారి యెదుటబడ నతఁడు భావగారూ! మీ రేల దొడ్డి పెటఁబడిరి? ఇంతవజుకును భోజనములేక యుంటిరా ? అపరాధము క్షమింపుడుడు. ఆచటనున్న