ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

అడిదము సూరకవి.


బోడిమి మిజు గనిన్నున్
వేఁడనికవి పొణ్గుపోటి • వేంకటమంత్రీ.

క. చుక్కలవ లెఁ గర్పూరపు
ముక్క వలె నీదుకీర్తిన్ ముల్లోకములన్
గ్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్క సముగఁ బొణ్గు పొటీ వేంకటమంత్రీ.

క. సగిదత్తురె గుణసంపద
వెఱంక మా పొణ్గుపాటి , వేంకటపతికా
గురుచక్రవర్తులు బదా
ర్గురు రాజులు ముప్పదిద్ధ • రునియోగివరుల్.

మీఁది పద్యములయందుఁ గల వర్ణనమతిశయోక్త్య లంకార భూయిష్టమైనట్లుగఁ గానఁ బడుచున్నను నీమంత్రి పుంగవున కీప్రాంతమునఁగల కీర్తి మాత్ర మద్దానిని స్వభావోక్తి యని యే చాటుచున్నది.


తనకు సూరకవి యాశ్రితుఁడై నను వేంకట మంత్రి మాత్రమాతని యెడలఁ బోష్యపోషక భావముచూపక యతనిఁదన నెచ్చెలిగ యోజించి తన బంధువుల కంటె నెక్కుడుగ గౌరవిం చుచువచ్చెను. సంవత్సరమునకు మూఁడు నాలుగుమాసములు శృంగవరపుకోటలో మంత్రిగారి యింటనే 'యుండు చుండెడి వాడు. ఆయాసమయముల యందు వేంకటమంత్రి గారి సన్నిధిని నిష్టగోష్ఠిగను లోకాభిరామముగను జరుగు ప్రసంగముల