ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

అడిదము సూరకవి


సూరకవి తఱుచు తన బంధువులను జూడఁబో పుచుండెడి నాఁడు. ఒకప్పుడితఁడు చీపురుపల్లి నుండి బయలు దేఱి తన బంధువులు బుఱఱా వారింట జరుగు నొకశుభకార్యమును జూడ, అదపాకకుఁబోవు చుండెను. (ఈగ్రామము చీపురుపల్లెకు నేడెనిమిది. మైళ్ళదూరమున నున్నది.) ఆనాఁడే సూరకవిగారింటికి సమీపమున నివసించు పాపయను పేరుగలయొక సాలిది కూడ నదపాక పోవుచుండెను. దారిలో నది సూరకవిని గలియ నతఁడు “ పాపా ! యెటు వెళ్లెదవే ? ”అని యడిగెను. “బాబూ! 'అత్త వారింటికి నదపొక "ఏళ్లుచున్నాను. ” అని పాప ప్రత్యుత్తరమిచ్చెను. సర్వకాల సర్వావస్థల యందును బద్యములల్లుటయే వేళ్ంబముగాఁగల మన కవిగారు పాప చెప్పిన మాటలనే యొక కందపద్య పాదములో ( అదపాకా అత్తవారు ? ఔనే పాపా ! యని తిరుగఁ జెప్పిరి. అంత పాప సూరన్న బాబూ! నీకుదండము. నామీఁద నొకపద్యమును గూర్పుము.' అని గోరెను. సూరకవి యాసొలిదాని కోరికను జెల్లింప నెంచి,

<* క. అదపాక మామిడాకులు -
పొదుపుగ దొరవి స్తరంటఁ - బొడిచినవాడే
మద మొప్ప విక్రమార్కుఁడు;
అదపాకా అత్తవారు! • ఔనేపాపా.

  • అమాయకురాలగు సాలిదాని గోర్కె చెల్లించఁ జెప్పిన పద్యమనివాడుకకుఁ దగినట్టుగ నే యున్నది. అదపాక మామిడాకులు విస్తరికుట్టుటకుఁదగిన వెడల్పు లేనివి. కవి గారియనుభవము. నిచట వెల్లడించియున్నారని చెప్పనగును.