ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయ భూమిక.


కావ్యకర్తల (Men of Letters.) జీవితచరితముల నాను పూర్వీకముగను సవిమర్శ ముగ ను వర్ణించు పుస్తకములాంగ్లమున నెన్నియో కలవు. కవులను వారికవనములకునుగల యన్యోన్యాశ్రయము నవి యెంతసమంజసముగనో " విశదశపరచును ఆట్టి కావ్యము లాంద్రమున లేకుండుట యొక గొప్పలోపమని. విమర్శకులయభిప్రాయము. ఈ "అడిదము సూరకవి" యను కావ్యము నాంధ్రమున నట్టిగ్రంథముగ వ్రాయించి మాయాంధ్ర పారిజాత గ్రంథావళియందు రెండవ ప్రచురముగ ప్రకటింపసాహసించితిమి.

ఆడిదము సూరక వినిగూర్చి వంశ పారంపర్వముగను, ఈప్రాంతమందు . " ప్రజలలో సంప్రదాయముగను నిలిచియున్న గాధలను, చాటువులను, ముచ్చటలను, వృత్తాంతములను చేర్చి విమర్శించి యోగ గ్రంథమును మl!రా || రా|| ఆడిదము రామారావు పంతులు గారు రచించి యాంధ్రుల కృతజ్ఞతకు పాత్రు లైనారు. ఆంధ్ర కవులనుగూర్చి యిట్టివిపులములగు జీవితచరిత ములాంధ్రమున లేవనియే చెప్పవచ్చును. ఇది యీ విషయమున ప్రథమప్రయత్నము.

దీనిని చదివినతరువాత సూరకవి యెట్టివాడో, ఆతనిశీల మెట్టిదో, అతని కవనములన్న నదియెంతవరకు నూహించదగి యున్నదో, " సూరకవి పొండిత్య మెట్టిదో అది యతని కవిత్వమున కెట్లు వన్నె తెచ్చినదో, సూరకవి వాగ్దాటియెట్టిదో, అదియాతని జీవితమునందె ట్లుపయోగ పడినదో ; ---ఇట్టి యంశముల నేకములు స్పష్ట పడగలవు, జీవితమందలి పోత్సాహములననుసరించి .. కవుల కల్ప నావిశేషములు 'సాగుచుండు నను సాహిత్య శాస్త్రమా సూరకవిపట్ల సిద్ధాంతమగుచున్న దనుటకు సందియము లేదు . ఇట్లు విపులముగ కవిజీవితమును రచించునపుడు కలగుకష్టములలో ముఖ్యమైనది . సమంజసములగు - గాథలచేర్చి , తాత్కాలిక ప్రయోజనము గలవాటిని విసర్జించుట. మొత్తము పయి నీకష్టమును కృతికర్తను సుళువుగా దాటెననియే.ఇందలి గాధలన్నియు రసవంతములైవినదగియే యున్నవి.