ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

అడిదము సూరకవి.



రాజు గారు కవితో లోకాభిరామముగ సంభాషించి ప్రసంగంశమున విజయనగర ప్రభువులను గూర్చి మిక్కిలి లాఘవముగ మాటలాడ సూరకవి యట్టి దానికిఁ గొంచెమైనను సహింపకరా 'జుగారికి విరసముగఁ బత్యు త్తరమిచ్చి తనప్రభువుల యెడలఁదన గలవిశ్వాసమును వెల్లడించెను. అంతరాజు గారికి మిగులఁగోపము రాఁగ సూరకవి సభయందు నిష్టము లేని వాఁడై వెడలి పోయెనను నీ మొదలగు వింతలు జరిగినట్టుగ నొకవాడుక కలదు. దీని యదార్థమును స్థిరపఱుప గవికృతములగు చాటుపద్యము లేవియుఁగానరావు. కాని యొక విషయము మాత్రము మిక్కిలిగ వ్యాపించి యున్నది. ఆనాఁడు సూరకవి సభవిడిచి బసకువచ్చి భోజనాది కృత్యములు నిర్వర్తించుకొని రాత్రి రెండు యామముల కాలము నిద్రించి వేకువజామున బయలు దేఱి షీకారుగంజి అడవిగుండా స్వస్థలమునకు బోవుచుండెను. "అప్పుడచ్చట సాయుధపాణులగు కొందఱు బోయవారును కవిని జంపుటకు సంసిద్దులుకాగా వారికి భయోత్పాతమగు నట్లు సూరకవి కిరుపక్కల. ధనుష్పాణులగు రామలక్ష్మణులును వారి చెంగట సుగ్రీవాంజనేయులును నిలిచినట్టుగ వారికిఁ గన్పట్టవారందఱు స్మృతిదోలంగిన వారై కొంత తడవూఱకుండి ' తెలివివచ్చిన పిదపఁబట్టణ మునకుఁ బోయి యావార్త పురజనులకు నెఱిఁగింప వారెల్లరాశ్చర్యమగ్ను లయిరఁట ! ఈవిషయమును స్థిరపఱుప సూరకవికృత' మని వాడుకలోనున్న పద్యమిట్లున్నది."