ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆజప ప్రకరణము,

51


కవీశ్వరుఁడగు సూరకవి తమపురమునకు వచ్చిన ఫుడెల్లను, పర్లాకిమిడి ప్రభువులగు నారాయణ దేవుగారు వాని నుచిత రీతిని గౌరవించి దవ్యరూపమగు బహుమాన మొసంగుచు వారి యాదార్యమును వెల్లడించుచుండిరి. మీఁది పద్యములానారాయణ దేవుమహారాజు సరసుఁడఁనియుఁబండి తావలంబకుఁడనియు బానశీలుఁడనియుఁ జాటుచున్నవి.

సూరకవిని నరాశన మొసంగి గౌరవించు మన్యపుసంస్థానములలోఁ బర్లాకిమిడి యొకటిగా నుండెను. "


ఒకానొకప్పుడు సూరకవి పాలకొండకుఁ బోయియుండెను. ఆకాలమున రామభద్ర రాజను పేరుగల యాతఁడువానిని బాలించ చుండెను. రాజు గారి దర్శనము చేయింపుఁడని మంత్రి లోనగు వారి, జాలదినము సూరకవి యాశ్రయించెను. ఏకాగణముననో సంస్థానముపందలి యున్నతోద్యోగస్థు లీతని విన్నపమును మన్నింపక , వీనియెడల సనాదరణఁజూపిరఁట. అంతసూరకవి మిగుల ఖిన్నుఁడును గుపితుఁడునునై యీక్రిందిప ద్యములను జెప్పెనని వాడుక.

శా. రాజు జారుఁడు మంత్రినియుఁడు నీరాష్ట్రంబులో పెద్దగా,
రోజుల్ కొండలు జీవహింసలను సం • కోచింప రెవ్వారికిన్
దాజీ మీయరు  ; పాలకొండపురిలో దాక్షిణ్యశూన్యత్వమీ
ఖాజీ పట్టణ మేల వచ్చితిని నా • పాపంబు సర్వేశ్వరా.