ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

అడిదము సూరకవి.



ఇది యిట్లుండ సూరకవిరాక రాజున కెట్లో తెలిసెను. అంత నాతఁడు జరిగినదాని కెంతయు వగచి సూరకవిని మరలఁ దస పట్టణమునకు రప్పింపనెంచి సవారీతోఁ దనమంత్రిని రామజంతి మార్గమున నంపెను. మంత్రి నిర్భంధము ను దాఁటఁజాలక సూరకవి పర్లాకిమిడికిఁ దిరుగ వచ్చి మహారాజుచే నుచిత రీతిని గౌరవింపఁబడి తగిన బహుమానమునందెను. ఆసమయమున గవి యామహారాజుగారి పై జెప్పిన పద్యములలో లభ్యమైన వానిని నిందుఁబొందు పఱచితిని.

<క. గోవింద ద్వాదశివలె .
వేవచ్చితి రాక రాక • నీనగరికి నో
పొవనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజ..

క. నీవిచ్చుభత్య ఖర్చొక
భూవల్లభుఁడిచ్చు త్యాగ • మున కెనవచ్చుస్
బావనగుణ నారాయణ
దేవుమహారాజ ! సాహి • తీనవభోజూ.

క. వారిధికిని వారిధియే
మేరునగంబునకు సాటి ఆ మేరువగంబే
నారాయణ దేవుకు సరి
నారాయణ దేవు గాక • నరపతు లేదురా!

ఆకాలమున, పర్లాకిమిడి వారికిని విజయనగరము వారికిని బరస్పర వైరము కలిగియుండెడిది. అయినను విజయనగరాస్థాన