ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'ఐదవ ప్రకరణము.

47



సూరకవి కాశ్రయులైన చినవిజయరామ మహారాజు గారు సరసులనియుఁ బండి తావలంబకులనియుఁ గవిపోషకులనియు మీఁదఁజూపియుంటిని. వీరుభయభాషల యందునుజక్కని పొండిత్యము గలిగి రెండింటియందును సరసమగు కవిత్వము చెప్పుసామర్థ్యము గలవారై యుండిరి. 'పెద్దాపుర సంస్థానాధిపతులపయి వీరు చెప్పిన సంస్కృతశ్లోకము నిందుఁ దార్కాణముగ జూపుచున్నాఁడను. ..

శ్లో|| అంభోజంకలయన్ సదృక్షమవ నే సాహిత్యరీత్యాం దృశో |
ర్మాం తారమపారసంపది మహాభాపే యశో రాశిషు |
శత్రూణాం పుగ భంజు నే ధృతి గుణేకించోర గేంద్రంమతి |
ప్రాగల్భ్యేలేఖ్య ప్రతిభాతి తిమ్మనృపతిః పాకాహిత ప్రాభవః |

ఈ విజయరామ నృపాలుని గూర్చి ప్రశంసించుచుఁ గీర్తి శేషులగు గురజాడ శ్రీ రామూర్తి పంతులు గారు తమకవి . జీవితములలో నిట్లు వాసియున్నారు. « ఈరాజశిఖామణి యుద్దమందు మడసిన వానికి వీరస్వర్గమున్నదా యని పలికిన వారిం గూర్చి చెప్పిన యొక పద్యము.

ఉ. ఇంచుక సూచివేదన సహిం • చినమాతనృపొంగ నాకు
చోదంచిత సౌఖ్య కేళి సత • తంబునుగంచుకి గాంచు నెట్లుదు
ర్వంచిత తీవ్రబాణనిక • రక్షతబాహుల కబ్బ వేమరు
చ్చంచలలోచనాఘనకు • చ స్తబక వ్యతిషంగ సౌఖ్యముల్.

ఈపద్యంబుచే నీ విజయరామమూర్తి కవియనియు సర సుండనియు నెంచందగియున్నది. ”