ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము.

43


విశేషము లమోఘములనియు, సూరనయెదుటఁ బొగడుటయే గాక యతఁడొక మహాకవీశ్వరుఁడని కూడఁ జెప్పుచు వచ్చెను.అంతసూరకవి, సోమప్పకవిని, సీతారామరాజు గారినిగూడఁబరా భూతులుగఁ జేయనెంచి సోమప్పకవి పై నీపద్యములను జెప్పెను.

 గీ. దేవు నానమున్ను • దేశానకొక కవి.
యిప్పుడూరనూర • నింటనింట
నేగురార్డు రెడ్లు • రెనమండ్రు తొమ్మండ్రు
పదుగు రేసికవులు • భవ్యచరిత.

క. ఏమేమోశాస్త్రంబులు .
తామిక్కిలి పతి కెనఁటస , తకనీ కవితా
సొమర్ధ్యమెఱుఁగ నేరని
సోమునిజృంభణము గలదె • సూరునియెదుటన్

.


అంత సోమప్పకవి, ప్రత్యుత్తర మియ్యనిచోఁ దనయ శక్తి వ్యక్తమగునని యెంచి యాశుగా నీకింది పద్యమును జెప్పెను.

గీ. సోమశబ్దార్థ మెఱుఁగని • శుంఠవగుట
వదరితివి గాని సూరుని రదనపాళి .
రాలదన్నిన సోముని , లీలఁ దెలియ -
వైతి, నీ గుట్టుబఁయలగు • ననుచుఁ గుకవి.


అంతసూరకవి యూరకొనక సోమప్పకవి సుద్దేశించి రెండు పధ్యములు చెప్పెను.