ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము.

41


సీతారామరాజుగారి వలెఁగాక చిన విజయరామ మహా రాజుగారు సూరకవి పజఞాది విశేషములను బాగుగగు నెఱిఁగియతని నుచిత రీతిని గౌరవించుచు వచ్చిరి. మహారాజుదయకుఁ బాత్రుడై సన్నిధిపతి యై మెలఁగుచుండిన పతివాడ పైడన్నయను పేరుగల 'దారూగా' యొక సమయమున సూరకవి యెడల నగౌరవమును జూపెనఁట. దానికి మిగులఁ గుపితుఁడయ్యు సూరన గోరంత వాఁడై నఁ గొండంత వాఁడైనఁ బగ కనర్హుఁకు నృపపార్శ్వవతిః ” (రామలిం గేశ శతకము) అను న్యాయము ననుసరించి దాని కేమియుఁ జేయ లేక యూరకుండెను. కాని నాఁడు. తాను రాజస్థానమునకుఁ బోయినపుడేది యోసందర్భమున "కః ఇత్తడిపుత్తడి యగునా ! తొత్తుకు నగలెన్నియున్న దొరసానగునా | యు త్తమకులుఁడౌ నాదౌ ! లత్తెం తలభించినను గులాము గులా మే ! ” అను పద్యమును రాజు సన్నిధిని జదివి యూరకొనెను. సరసుఁడగు నీవిజయరామన్న పాలుఁను మీఁది సమాచారమును నెటులో తెలిసికొని సూతకవి, మీఁది పద్యమును దన సన్నిధిని జదువుట కది కారణముణముగాఁ దలంచి 'దారూగా' యగుపతివాడ "పై డన్నకు దేవిడీ మన్నాయను శిక్షను విధించెను. నాఁడు బుద్ధినెఱిఁగి తన యపరాధమును సూరకవికీ నివేదించి క్షమింపుఁడని వేడుకొనఁగ సతఁడీకింది పద్యమునుచెప్పెనని వాడుక గలదు.