ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

అడిదము సూరకవి.



పూర్వోదాహృతమైన రాజుకళంకమూర్తి" అను పద్యమును ( పెద్దాపురమునఁదు' సూరకవి చెప్పినప్పుడు మహా రాజును మంత్రి మొదలగు నితరోన్నతో ద్యోగస్థులును, పద్య ముయొక్క. సొగసున కెంతయు మెచ్చి కవికిఁ గనకాభి షేకము చేయించిరఁట ; అట్టి యపూర్వ గౌరవమునకు సూరకవి మిక్కిలిగ సంతసించి తనకృతజ్ఞతను ప్రభువునకును, మంత్రియుఁదన బందుగుఁడు నగు బుఱ్ఱ బుచ్చనామాత్యునకును ననేకవిధముల వెల్లడించెను. అభిషేకము చేయఁబడిన బంగారు నాణెము లను గవి తప్పక పరిగ్రహించునని మహారాజు లోనగువారు తలంచిరి. కాని సూరకవి మాత్రము వానిని ముట్టఁడయ్యెను. • పరిగ్రహింపుఁడ'ని చెప్పినపుడు సూరకవి " మహాప్రభూ! ఏలి నవారి కటాక్షముచే నింతదనుక స్నానము చేసిన యుదకమును బానము చేయ లేద ”ని చెప్ప మహారాజు లోనగువారు సూరకవి నిర్లక్ష్య భానమున కెంతయు నాశ్చర్యపడిరి. విజయరామమహా రాజు సూరకవి చెప్పిన సమాధాన మెంతయు యుక్తియు క్తముగ నున్నదని సంతసించి, యతనికి వేఱుగ బహునూన మొసఁగి గౌరవించెను. తాను సుఖముగ జీవయాత్ర గడపఁదగిన యుప వృత్తిలేని వాఁడయ్యు ' ద్రవ్య విషయమున నిట్టి నిర్లిప్తతను జూపుట యతని స్వతంతబుద్ధిని భావదారిద్ర్యమును వెల్లడిచే యుచున్నది.