ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము.

39



అని యేకవచన ప్రయోగము చేయఁదగునా ? నీవు మహాకవివి మైసను నితరులను మన్నించి నీవు మన్నన గొనవలెను " అని చెప్ప సూరకవి

  * క. చిన్నప్పుడురతి కేళిని
సున్నప్పుడు కవితలోన యుద్ధములోనన్
వన్నె నుమీ 'రా' కొట్టుట
చెన్న గునో పూసపాటి • సీతారామా !.

అని బదులు చెప్పెను.

సమయోచితమగు నీ ప్రత్యుత్తరము సభ్యులకు మోదకరమయ్యును సీతారామరాజుగారికి మాత్రము ఖేదకారియయ్యె . ఇట్టి కారణ పరంపరచే నానాఁటికి సూరకవి పై సీతారామరాజు గారికి ననాదగణము హెచ్చు కాఁజొచ్చెను. కవి పెక్కుచోట్లఁదన రామలింగేశ్వర శతకములో సీతారామరాజు గారి చండశాస నత్వమును సూచించుచునే వచ్చెను. మొత్తము మీఁద సూరకవియొక్క యాస్థానకవి పదము జయప్రదముగను సుఖదాయక ముగను వెళ్ళుట లేదు.


 శ్లో, బాల్యేనుతానాం నుర తేంగనానాం !
న్తుతోకవీనాం సమ రేభటానాం |
త్వం కారనాదాహిగిరః పశస్తాః |
కస్తేప్రభో మోహతరస్స్మరత్వమ్ |

అను నీశ్లోకమును మనమునందుంచుకొని మీఁది పద్యమును జెప్పినట్టు గ' నూహింపవచ్చును,