ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

అడిదము సూరకవి.


కానేరదు. ఇట్టి నడవడి యేకవికిఁ దఱచు గలుగుచు వచ్చిన దేవిడీ మాన్నాల "కుఁ గారణమని చెప్పుదురు. సూరకవి. సహజముగ నిట్టి స్వభావము కలవాఁడు కాకపోయినను నప్పటి దివానును రాజుగారి యగ్రజుఁడును నగు సీతారామరాజుగారు కవి యెడలఁ జూపుచువచ్చిన యనాదరణమును నీర్ష్యయుఁ గొంతవఱకుఁ గారణమై యుండవచ్చును. ఈ సీతారామరాజు గారిని గూర్చి కవికృతమగు రామలింగేశ శతకమును విమర్శించు సందర్భమున నికముందు వ్రాయుచున్నాను. కాన నిచట విడచితిని.

ఒకనాఁడు మహారాజు, పండితులు కవులు మొదలగు వారితో నిండుకొలువునఁ గూర్చుండియుండ నప్పటి సందర్భము ననుసరించి సూరకవి యాశుగా.

 ఉ. పంతముననీకు జెల్లు నొక • పాటియమిరుఁడు నీకులక్ష్యమా
కుంతము కేలఁ బూని నిను • గొల్వనివాఁడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేఁడు కటకంబు మొదల్కొని గోలుకొండ ప
ర్యంతము నీ వెకా విజయ • రామనరేంద్ర వైభవా. "

అనియొక పద్యమునుఁ జెప్ప దానికి రాజును సభ్యులునుమిగులసంతసించి కవిని బహువిధముల శ్లాఘించిరి ; కాని సీతారా మరాజుగారు మాత్రమొక యద్భుతమగు నాక్షేపణము చేసిరి. ఎట్లనిన - మండలాధీశ్వరునిగూర్చి నీకుఁ జెల్లు; నీకు లక్ష్యమా?