ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము

సంస్థానాస్థాన కవి పదము


సూరకవి తన ప్రభువును విజయనగర సంస్థానాధీశుఁడు నగు చిన విజయరామ మహారాజు నాదరణమును బొందియా స్థానకవిగానుండెనని ప్రబలమగు నొక వాడుక కలదు గాని యితఁడు విజయనగరమునఁ గాపురముండి నట్టును నితరులగు నాస్థాన పండితులవలె నిత్యము రాజస్థానమునకుఁ బోవుచు వచ్చుచుండినట్టును జెప్పుటకు నాధారములంతగఁ గానరావు. ఇతఁడాకాలమున నాస్థానకవి పదమలంకరించి విజయనగరమునఁ గాఁపురముండక చీపురుపల్లె యందే నివసించుచుఁ దఱచు విజయనగరమునకు వచ్చి తన ప్రభువులను దర్శించుచు నియమితో ద్యోగమును నెజవేర్చు కోనుచునుండెడి వాడు.

సూరకవి ప్రజ్ఞావంతుఁడును విద్యాధికుఁడును నై యుండియుఁ దన స్వాముల యెడలఁ జూపనలసిన వినయమును జూపక యొక విధమగు స్వాతంత్యమును గనుపఱ చెడి వాఁడు. స్వతంత్రం ఈ బుద్ధి కలిగియుండుట ప్రశంసనీయమైననుఁ దన యేలికల పట్ల నవిధేయతను జూపునడనడి మాత్రము శ్లాఘాపాత్రము.