ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము.

33



రాజ్యముచేసిరి. ఆయన స్వరస్థు లైన సిదప ఆ చినవిజయరామ మహా రాజు”గారు సింహాసనమునకు వచ్చి 1760-1794, వఱకు ను రాజ్యముచేసిరి. ఈమహా రాజుగారి కాలముననే మన కవి గారి ప్రభంచాల హెచ్చుగ నుండెను. సూరకవి యీచిన విజ యరామమహా రాజు గారి కాలమున నున్నాఁడనుటకు నిదర్శనములు పెక్కులుగలవు. ఒకటి రెండింటిని మాత్రమిచటఁ జూపు చున్నాఁడను. . శ్రీ వత్సవాయి తిమ్మ జగపతి మహా రాజుగారి రాజ్య కాలమున 'పెద్దాపురము 'లో నొకప్పుడు రాజులందఱు(తమ బంధువర్గములోని, వారును మిత్రమండలిలోని నారును నగు మహారాజులు) సభ చేసి కూర్చుండి యుండఁగా సూరకవి తన ప్రభువును స్తుతించుచు.

<poem> ఉ. రాజుకళంకమూర్తి రతి రాజు శరీరవిహీనుఁడంబికా రాజు దిగంబరుండు మృగ రాజు గుహాంతర సీమవతింవి భ్రాజితపూసపా డ్విజయ • రామసృపాలుఁడు రాజు గాక యీ రాజులు రాజు లే పెనుత రాజులు గాక ధరాతలంబునన్ ,

అను నీపద్యమును సభాసదులైన రాజులవంక ఁ జూచుచుసభిన యముతోఁ జదువనందలి కడపటివాక్యము తమ్ము నుద్దేశించి కవి చెప్పెనని యభిప్రాయపడి మహీపాలురంద ఱొక్కుమ్మడిఁ గోపమును జూప నతఁడించు కేనియు జంకక పద్యార్థమునుదేట