ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము.

31



నలువది గుండు దెబ్బలతో బడియుండెను. ఇట్లు మరణమునొందిసవారు గాక పాఱిపోయి న వారిలో 'నెందఱికి గాయములుతగిలినవో తెలియలేదు. ఇంగ్లీషు సైనీకులలో మృతినొందిన వారు పదముగ్గురు, గాయపడిన వారఱువది యొక్కరు. ముప్పదియేండ్ల కిందట బొబ్బిలికోట ముందు పెదవిజయరామరాజుగారు హతులైనట్లే, మనకవీంద్రుని కాలములో నుండిన యీచిన విజయరామరాజుగారు పద్మనాభ పుకొండ ముందు నిహతులై రి. మన కవి కాలముతో సంబంధించిన చరిత్రమింతే. తండ్రి మర ణమును విని యప్పటి కెనిమిది సంవత్సరములు ప్రాయము వాఁడై న నారాయణ బాబుగారు తల్లీతోడ గూడ కొండ దేశమునకు పాటిపోయిరి. కాని కంపెనీ వారాయనను బిలిపించి దొరతనమిచ్చిరి. ” (రావుబహదూరు కం!! వీరేశలింగముపంతులుగారు ఆంధ్ర కవుల చరితము. తృతీయ భాగము పుటలు. 69-75.) :

పాఠక మహాశయులారా ! రారాజులచేతను గవిరాజుల చేతను,విలసిల్లి దిగంత విశ్రాంతమగు కీర్తినిగాంచిన శ్రీ పూస పాటి మహా రాజవంశమును గూర్చి వాయవ లెనన్న ఒక ప త్యేక గ్రంథమగును. అంత విపులముగ నిచట వివరింప నవ కాశము లేనివాఁడనై శ్రీవీరేశలింగము - పంతులగారి గ్రంథ మునందు సంగ్రహముగ వాయబడిన చరిత్రమును గైకొని నిచట నుపయోగపఱచు కొంటిని.. .. .. .. . . .