ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

అడిచము సూరకవి.


జేరిరి. కంపెనీ వారికీ సంగతి తెలియఁగానే యిరువదినాలుగుగంటల కాలము గడువిచ్చి యాలోపల నతఁడు బందరు మార్గమున బయలు దేఱని పక్షమున బలత్కారముగాఁ బంపవలసినదని విశామపట్టణములో నున్న సేనానాయకున కుత్తరువుచేసిరి. పయివారి యుత్తరువును దెలియఁబఱిచి యింగ్లీషు సేనాధిపతి యయిన ప్రెండర్గాస్టుగారు కొంతసేన (750 భటుల)తో పద్మ నాభమునకుఁబోయిరి. 1794 సంవత్సరము జూలై నెల తే 10 ది యుద్దయమున నింగ్లీషు సేనాధిపతి పద్మనాభపు కొండనుజేరున ప్పటికి, విజయరామరాజు గారును బంధువులయిన రాచవారును ఖడ్గపాణులయి లోఁబడక యుద్ధముచేసి వీర మరణము నొందుటకు నిశ్చయించుకొని యందఱును పద్మ నాభస్వామి ప్రసాదమును స్వీకరించి యుద్డోన్ముఖులయి నిలిచి యుండిరి. నాఁడు సూర్యోదయకాలమున నింగ్లీషు సేన లకును రాజుగారి సేసలకును ముప్పావు గంటసేపు ఘోరయుద్ధము జరిగినది. అంతట రాజు గారి సేనలన్నియు చెల్లాచెదరయి పాఱిపోయినవి. రణరంగము నకుఁబోయి చూడఁగా రణనిహతులై వీరశయనము నొందిన వారి శరీరములక్కడ మున్నూట తొమ్మిది కనఁబడినవి. రణభూమి నలంకరించిన 'మున్నూట తొమ్మిదింటిలో నిన్నూట యెనుబది రాచవారి దేహములు. రణరంగమధ్యమునఁ బడియుండిన విజయరామరాజుగారె శవము చుట్టునుకోట కట్టినట్లుగా సంస్థానము లో నున్నతస్థితిలో నుండిన . యుత్తమ క్షత్రియుల శవములు