ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

అడిదము సూరకవి.


పరిపాలకుఁడు విజయరామరాజు గారిని చెన్నపురి రమ్మనికో రెను, కోరిన ప్రకారముగా విజయరామరాజుగారు చెన్న పురికిఁబోక ప్రయాణ వ్యయములకు తన చేత సొమ్ము లేదనియు, తనయన్న యయిన సీతారామరాజుగారు తన్ను నాశనముచేయుటకయి తంత్రములు పన్ను చుండిన యాకాలములోఁ దాను రాజధానిని విడిచి దూరముగాఁ బోవుట యుచితము కాదనియు, విశామపట్టణములోని యధికారుల సమక్షమునఁ దాను వారు విధించెడు న్యాయమైన కప్పమున కంగీకరించెదననియు చెప్పి తప్పించుకొ నెను. అంతట చెన్నపురి పరిపాలకుఁడు సీతారామరాజుగారిని చెన్నపురికి రమ్మనికోరఁగానే యతఁడు తక్షణమేపోయి యక్కడివారిని వశపఱచుకొని, రాజా కార్యములు చక్కఁబఱుచు కొని విజయనగర సంస్థానమునకు తన్ను దీవానుగా నేర్పాటుచేయించు కొని తసపుత్రుని స్వీకారమును స్థిరపడిపించుకొని, మరల వచ్చెను. ఈ యేర్పాటుల వలన విజయరామరాజు గారు పేరునకు రాజుగా నుండినను నిజమైన యధికారమంతయు సీతారామరాజుగారి చేతిలో నే చిక్కెను. ఈ విషయ మై విజయరామరాజుగారు కంపెనీ వారికి మొఱ పెట్టుకోఁగా పె ట్టుకోఁగా తుదకు వారాయనను దివాను పనినుండి తొలఁగించి విజయనగరము విడుచునట్లుత్తరువు చేసిరి. అందుపయిని సీతా రామరాజుగారు : విజయనగరము విడిచి సింహాచలము నివాస ముగా నేర్పఱచుకొని యక్కడ కొంతకాలముఁడి, తరువాత