ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము.

27



కాని సీతారామరాజుగా రన్నిటికిని దగినవాడై నందున నింగ్లీషు సేనలను సహాయ్య పఱుచుకొని యాకొండ సంస్థానాథపతుల నొక్కక్కరినే జయించి కొందఱి దేశములను తమ రాజ్యములోఁ గలుపుకొనియు కొందఱిని విజయనగరమునఁ జెఱసాలలో బెట్టియు నందఱిని సాధించెను. ఈకలహములలో ఆండ్ర పాలకొండజమీన్ దారులు మాత్రము చేర లేదు. సీతారామరాజుగా రిట్లుపరరాజులను జయించుటయే కాక తురకదొరలు మసీదుల కిచ్చిన భూములను పూర్వరాజులు బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను సహితము .క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూరకవిని రామలింగేశ శతకము 'చెప్పనట్లు చేసినవి. "


ఇట్లుండఁగా సంస్థానము నందుండిన రాచవాఱందరు నొకటిగాఁ జేరి 1775 న సంవత్సరమునందు మంత్రిత్వమును మాని రాజ కార్య సంబంధము వదలుకొను నట్లు సీతారామరాజు గారిని నిర్బంధపఱచిరి. తన పుత్రుడయిన నరసింహగజపతి రాజును స్వీకారముచేసికొని విజయరామరాజు గారి మరణానంతరమున సింహాసన మాతనికిచ్చునట్లు తమ్ముని నొడఁబఱచి యాయన తాను మంత్రిత్వమును విడుచుట కంగీకరించెను. ” . విజయనగరము వారు చెల్లింపవలసిన కప్పముయొక్క మొత్తమును నిర్ణయించుటకయి కంపెనీ వారి చెన్న పురి