ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఆడిదము సూరకవి.


రాజయిన చిన్న రంగారావుగారిని పట్టుకొని విజయనగరములో చెఱసాల యందుంచెను. పర్లాకిమిడి రాజగు నారాయణ దేవు! జగన్నాధయాత్ర పోవుట సందు చేసికొని యతని రాజ్యముమీద దండెత్తి యాత్ర నుండి తిరిగివచ్చిన యాతని నరసన్న పేట వద్ద నోడించి యిప్పటి గంజాము మండలములో విశేషభాగము ను విజయనగర రాజ్యములోఁ జేర్చెను. తన తమ్ముని వెంటఁగొని తండనూత వెడలి సీతారామరాజుగారు మొగలితుఱు వఱకు నువచ్చి స్థానిక పాలకుఁడయిన నబాబు బడ్జి అబ్జమాఖానును జయించి కొంతకాలము 'రాజమహేంద్రవరము సర్కాను సహిత మాక్రమించినట్లు చెప్పుదురు. ఇట్లింకను పెక్కు జయములను బొంది మహోన్నత దశయందుండిన యీకాలములోనే యింగ్లీషువారు నిజామువలనఁ బొందిన సనదుప్రకారముగా నుత్తరపు సర్కారులలోఁ దమ యధికారమును జెల్లించుట కారంభించిరి. ఇంగ్లీషుకంపెనీ వారితోఁ జేసికొన్న యొడంబడికనుబట్టి సం పత్సరమునకు మూఁడులక్షల రూపాయిలు పేష్కష్.. చెల్లించుటకును, పర్లాకిమిడి రాజయిన నారాయణ దేవు వలనఁ గైకొన్న రాజ్యమును విడిచి పెట్టుటకును విజయనగరము వారొప్పుకొనిరి ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత విజయనగరసంస్థానమునకు లోబడియున్న కొండజమీందారు లందఱును విజయనగరము వారి మీద తిరుగఁబడి స్వతంత్రులగుటకుఁ బ్రయత్నించిరి.