ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

అడిదము సూరకవి.


పట్టణములును, వాని చుట్టుపట్లగల దేశమునుదక్క మిగిలిన భా గమును దన పాలనములో నుంచునట్లును యుద్ధవ్యయముల కింద తాను నెల కేఁబదివేలరూపాయల చొప్పున నిచ్చునట్లు ను ఏర్పఱచుకొని, కర్నల్ ఫోర్డుగారిచే నడపఁబకు చుండిన ఇంగ్లీషుసేనతోఁ దన సేనను జేర్చి దండయాత్ర వెడలెను. ఆవఱకే ఫ్రెంచి సేనానాయకుఁడయిన కప్లాన్సుగా రానందగజపతిరాజు గారిని శిక్షించుటకయి దండయాత్ర వెడలి యింగ్లీషు సేన యాయనతో, జేరినదని విని రాజమహేంద్రవరమున నిలిచి పోయెను. కర్నల్ ఫోర్డుగా రానంద రాజుగారు వెంటరాఁగా రాజు మహేందవరమునకు వచ్చి ఫ్రెంచి సేనాధిపతియైన కన్ ఫ్రాన్సు గారి సక్కడనుండి పాఱుఁదోలి, మచిలీ బందరున బోయి ! దానిని స్వాధీనపఱచుకొనెను. దండు వెడలియున్న యింగ్లీషు వారిని జయించుటకయి నిజాముసలాబత్ జంగు మచిలీ బందరు నకు 15 మైళ్ళ దూరము వఱకును వచ్చి వారినిజయించుట సాధ్యముకాదని తెలిసికొని 1759 వ సం||రము మెయి 14 వ తేదీ ని సంధి చేసికొని మచిలీ బందరు సర్కారును కొండవీడు నైజాముపట్టణము సర్కారులును ఇంగ్లీషు వారికిచ్చి వేసి, ఆనందగజప తిరాజు గారు "ప్రెంచి వారి కియ్యంబడిన దేశమునుండి గ్రహించిన సొమ్ము విషయమై తగవు పెట్టక విడిచి పెట్టి వారి తండ్రి తాతల నుండి వారనుభవించు చుండిన దేశమును వారనుభవించుట కంగీకరించెను. ఈయొడంబడిక యయిన తరువాత స్వదేశము