ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము.

23


వారియెడల విశ్వాసము గలవాఁడయి యుండి 1755 వ సంవత్సరమున ప్రెంచి సేనానాయకుఁడయిన బుస్సీకి కావలసిన ధనమును రహస్యముగాఁ బంపెను. తరువాత బుస్సీ సేనలతో దేశమును స్వాధీనముచేసి కొనుటకు కళింగ దేశమునకు వచ్చినప్పు డీయన బొబ్బిలివారితోడి తసపూర్వ వైరమును సాధించుకొనుటకయి బుస్సీని పురికొల్పి యుద్ధము చేయునట్లు చేసి తానుగూడ సేనలతోఁబోయి 1757 'సం!! జనవరు నెల 24 వ తేదీని తాండ్ర పాపయ్యచే పొడువబడి పరమపదము నొందెను. తరువాత విజయరామరాజు గారి * పితృవ్యపుత్రుడైన యానందగజపతిరాజుగారు సింహాసనమునకు వచ్చి, బుస్సీ విజయ రామరాజుగారి యెడలఁ జూపిన యాదరమును తన యెడలఁ జూపకపోవుల చేత మనసులో ద్వేషము పెట్టుకొని బుస్సీ విశాఖపట్టణము మొదలై సస్థానముల నన్నిటిని స్వాధీనము చేసికొని పై యధికారుల యుత్తరువు ననుసరించి యీ దేశమును విడిచి కర్ణాటకమునకు వెడలి పోఁగానే సేనలను గూర్చుకొనిపోయి విశాపట్టణమును పట్టుకొని దాని నింగ్లీషువారికి వశపఱచెదనని యుత్తరములు వాసి 1757 సం||రమున వారితో స్నేహముచేసికోనెను. తరువాత నతఁడు ఫ్రెంచివారి నుత్తరపు సర్కారుల నుండి తమివేయు ప్రయత్నములలో నింగ్లీషువారితోఁ జేరి, దొరకినకొల్లలోఁదనకు భాగమిచ్చునట్లును, జయించిన దేశములో నదీసముద్రతీర -


* పితృవ్య పౌరులు, "గాని, పుత్రులు గారు.

.