ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

అడిడము నూరకవి.


ప్రబలుఁడై యుండెను. ఈయన యనంతరమున *నానందరా జుగారు పరిపాలనమునకు వచ్చిరి. ఈయన పుత్రులు విజయ రామరాజుగారు బహుప్రసిద్ధ పురుషులు. ఈయన మన్నె దొర లను గెలిచి వారి దేశము లాక్రమించుకొని మన్నె సుల్తాను బిరుదంది, పొట్నూరు నుండి తన పేరిట విజయనగరమను పేరం బరఁగిన యూరికి. రాజధానిని మార్చుకొని 1712 వ సంవత్సర మునకు సరియైన విజయసంవత్సర విజయదశమి జయవారము నాఁడు కోటకట్టుటకు శంకుస్థాపనము చేసెను.

1758 వ సంవత్సరమున నిజాము, కొండపల్లి, యలూరు, రాజమహేంద్ర వరము, శ్రీకాకుళము సర్కారులను ఫ్రెంచి వారికి చ్చెను. అప్పుడు విజయరామరాజుగారు శ్రీకాకుళము " నకు నాయిబయిన జాఫరల్లీతోఁ జేరి దేశము ఫెంచివారికి ఈ స్వాధీనము కాకుండునట్లు చేయుటకయి ప్రయత్నించెను గాని, వారు రాజమహేంద్రవరము శ్రీకాకుళపు సర్కాలను తక్కున సిస్తుకు కవులునకి చ్చెద మన్నందున జాఫరల్లీని విడిచి 'ఫ్రెంచి వారితోఁ జేరెను. తరువాత సర్కారులోని రాజులందజును పెంచి వారికి .లోఁబడక తిరుగఁబడి నప్పుడు సహితమీయస


  • ఈ ఆనందరాజు. గారిని సీతారామచంద్ర మహారాజులుం గారు శ్రీ పూసపాటి పెదజగన్నాధ రాజు గారి కుటుంబములో నుండి దత్తత చేసికొని నట్లు కనఁబడుచున్నది. ...