ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

సూరకవి కాలము.


ఈ కవికాలమును నిద్దారణ చేయు సందర్భమున నితనికి నాశ్రయులును, ప్రభువులును నగు శ్రీవిజయనగరాధీశులను గూర్చియు,వారి సంస్థానమును గూర్చియు నిందుఁ గొంతవఱకు వివరించుట యనుచితము కానేరదు.

శ్రీవిజయనగర ప్రభువులగు శ్రీ పూసపాటి వారు సూర్య వంశజులు. దుర్గాసాక్షాత్కారముఁ బొంది, తనతపః ప్రభావమునఁ దానేలు రాజ్యమున నేడు గడియల కాలము సువర్ణ వృష్టి ,గురిపిం చెనను ప్రసిద్ధిగన్న శ్రీమాధవనర్మ సంతతివారు. కొండపల్లి సర్కారులోని పూసపాడను గ్రామనివాసము చేత వీరికి పూసపాటి వారని యింటి పేరు గలిగినది. ఓరుగంటి సంస్థానము ప్రతాపరుద్రునితో సశించిన వెనుక వత్సవాయివారు, పూసపాటివారు మొదలయిన వారు మహమ్మదీయులకు లోఁబడిరి. రఘునాధరాజను మాఱుపేరు గల *పూసపాటి తమ్మిరా జుగారు గోలకొండలో సరదారుగా నుండి శ్రీకాకుళమునకు వచ్చి,



  • « ఈతమ్మి రాజు గారికి రఘునాధరాజను మాఱు పేరు లేదు. ఈయన యన్న గారి పేరు రఘునాధ రాజు. " శ్రీకృష్ణ విజయము "న నీవిషయము స్ప స్టముగఁ జెప్పబడియున్నది. ఈ తమ్మి రాజు గా రీ కృష్ణ విజయమును రచించిన కవి. వ్యవహారమున నీయసకు మాధవ వర్మయని వాడుక యుండినట్టగ జరిత్రల వలనం దెలియుచున్నది — విశాఖపట్టణ, మండల, చరితమున నిుట్లున్నది.