ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

19


వఱకు మామూలు మాటలలో సహితము పరియాచకమునకై నడుమనడుమఁ బద్యరూపముగ సంభాషించుచు. వచ్చెనంట. • వంటయేమి చేయుదు ' నని భార్య యడిగినపుడు సూరకవి «« 'పులగములోపలికి పచ్చిపులుసే కాదా? "యని చెప్పిన పద్య 'పాదము మీఁది యంశమును రుజువు చేయఁగలదు.

వాడుక ననుసరించి చెప్పఁబూనినచో సూరకవి యొక మాదిరి లావుశ రీరమును,నల్లని శరీరచ్చాయయుఁ గలిగి పొడువుగ నుండెడివాఁడని చెప్పవలెను. ( అతని వేషంబంతయు (బండితరీతి నుండక మొగలాయి విధంబున నుండు. కావునఁ దదనుగుణమైన లాగు, పాగా, యంగరఖాలను దాల్చి యొక ప్రక్క గంటపుటోర యును, రెండువదిక్కున బాకును బూని | ఇదం “బ్రహ్మ్యంబ్రాఃమ్యమిదం క్షాత్రామను రీతినుండి యేరైన మీరెవరనియడిగిన నేనడిదము సూరుఁడననుచుండు. " (గు!! శ్రీరామమూర్తి గారి కవి జీని తములు.)