ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము.

17


హాయిగ నుండి సౌఖ్యమనుభవించినట్టుగ +* 'తండ్రి గల్గిన 'పెన్ని ధాన మేల" అను రామలింగేశ శతకములోని వాక్యమును బట్టి యూహింపనగును. సూరకవికి నతని తండ్రిగారు సజీవులై యున్నప్పుడే వివాహామాయెను. ఆ కాలమునఁ గోటిపల్లెయందు నివసించెడి వడ్డాది వారెపిల్లను నీతఁడు పెండ్లియాడెను. రైలు లేని యాదినములలో, నిట్టి దూర దేశపు సంబంధము మాకుటుం బమున కెట్లు కలిగెనో యూహింప వీలు లేకున్నది. ఒకానొకప్పు డు నితఁడేదియో రోగముచే బాధపడుచుండి యాసమాచారము నత్తవారికిఁ ' దెలియఁజేయ వారెవరును రానందులకు వగచి యాతని భార్య దానిని గూర్చి ప్రశంసింప నతఁడు తెలియని దానవు సుమ్మీ | పిలిచినపరుఁగెత్తి రాను పెండ్లా వడుగా”యని భార్య తోననెను. చీపురుపల్లెలో నున్న కాలముననే . సూరకవి సంతానవంతుఁ డయ్యెను. ఇతనికి నొక కుమారుఁడును నొక కొమా ర్తెయును గలిగిరి. కుమారునికి 'బాలభాస్కరుఁడనియు, కొమా ర్తెకు నరసమ్మయనియుఁ బేర్లు పెట్టెను. కొమా ర్తెను రెల్లివలస పాణంగిపల్లి వారికి చ్చెను. ఈసాణంగిపల్లి వారితో జేసిన సంబంధమును బట్టియే సూరకవికిఁ బిదపనాతని కటుంబ


1 ఇయ్యది భవభూతి మహాకవి యుతర రామచరితములోని . గీ. మంచి చెడ్డలుతండ్రి వీ క్షించుచుండఁ దల్లులును ముద్దుముచ్చటల్ "దలచుచుండఁ | గొ త్తప్రియు రాండ్రతోఁ గూడి • కులికినట్టి | క్షణములని తమ్ముఁ డారావు • కదమఱింక! ” అను శ్రీ రాముని వాఖ్యములను జ్ఞప్తి కి చ్చుచున్నది.