ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆడిదము సూరకవి.



ధనము సంపాదించి దానిచేఁ గాల క్షేపము చేయుచుండెడివాఁడు ఇదియే పూర్వోదాహృత పద్యమున ( మన్య దేశముల్ తిరిగి యభీష్ట వస్తువులు తెచ్చి భుజింతుము సర్వకాలమున్ ”అని చెప్పఁ . బడెను. ఇంతియ గాక యితఁడు చీపురుపల్లెలోను దానిసమీప గామములలోను స్వగ్రామమగు భూపాలరాజు "రేగడలోను వైశ్యుల యిండ్లకడ వివాహములు జరిగినపుడు తప్పక యచ్చటికిఁబోయి కవీశ్వర సంభావనలను గైకొనెడి వాడు. దీనిని గూర్చియే కవి తన రామలింగేశ్వర శతకములో * « కవులకీ! గలజాతి యొక్కటియు లేదు | వితరణము వైశ్యులకుఁ బెండ్లి వేళ కలదు ! కొంకుపఱతురు కుపతులా కూటికొఱకు | రామలింగేశ రామచంద్రపురవాస | ” అని వాసియున్నాడు. మొత్తము మీఁద సూరకవి చీపురపల్లెలోఁ దన జీవితమును నిబ్బంది లేకుం డఁగఁ జరిపినట్టు కనఁబడదు. ఇతఁడుతన తండ్రిగారి సంరక్షణలో


  • చినవిజయరామ మహారాజు గారి కాలమున నాయన 'యగ్రజుఁడు నీతారామరాజు గారు దివానుగా నుండి రాజకీయ వ్యవహారములలో సర్వా ధికారము జపుచుండెడి వారు. ఒకప్పుడాయన సూరకవి కోమటి పెండ్లిం డ్లపంభావనల నెపమున దర్బారు విడిచి పోఁగూడదని ఆజ్ఞ పెట్టెనంట. కాని నూరకవి మాత్రమట్టి యాజ్ఞను మన్నింపక విధిగాఁ గోమటి పెండ్లిండ్ల సంభావనలకుఁ బోవుచుండెడి వాఁడు. ఆషయమే యిచట సూచింపఁ బడినది.