ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

అడ్డము సూరకవి.



సూరకవిక విద్యాగురు వతని తండ్రిగారే యని నిశ్చయించితిని. సూరకవిప్రణీత గ్రంథములను జక్కఁగఁ బరిశీలించి చూచినచో నతనికీ సుభయభాషలయందును నఖండమగు పాండిత్యము కలదనియు, సంస్కృతమున సతఁడు నాటకాలంకార సాహిత్యము గలవాడగుటయేగాక పాణినీయ వ్యాకరణజ్ఞుండునుగూడ నై యుండినట్లు కనఁబడుచున్నది. ఇట్టి విద్యాసంపాదనమునకుఁ గారణభూతుఁమును గురువునునగు బాల . భాస్కరకవి యుభయభాషా కోవిదుఁడై యుండునని నా నమ్మకము. సూరన తన క | సం!! వి॥ లో.......... శ్లాఘాలం | ఘనజాంఘిక కవనధాటీ • కలిగిన మేటి?” అని తండ్రి గారు నుతించి యున్నాడు. శుద్ధాంద్ర రామాయణములో నిదక్ష “ నిగిడిరువైపుల న్వెడల • నేటయి నీటగు వీటికోట" అను 'నీఛంపకమాలికా పొదము వసుచరిత్రములోని “వీటన్మిటగు జోటు: 'లేటి వరద • స్వేమారు గీడింప ” etc అను పద్యము " ఛాయనున్నది.. దీనినిబట్టి చూడ 'భాభాస్కరకవి వసుచరిత " మొదలగు ప్రబంధరత్నముల కవితాధోరణీనిఁ దనకు మేలు బంతి (model) గా నిడుకొని..యీయచ్చతెనుఁగుఁ గబ్బమును - మిగుల రసవత్తరముగ, రచించెనని నేనూహించుచున్నాఁడను,