ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

11


గారియొద్ద నొకనాఁడొక యాంధ్రగ్రంథము సారము చెప్పికొనుచుసందు . తగ | మావిమూక 'వసంతాగమంబు లేక యను గీత పద్యభాగమును జూచి యందలి 'తగన్ ' అను వ్యర్థ పదప్రయోగమును గూర్చి తండ్రి గారతో జర్చింప నంత చిన్న పయుసునం దన కుమారు డుచేయు విమర్శనకు భాస్కరకవి లోలోనసంతసించుచు వచ్చెను. ఇట్లు సూరస యిరువది సంవత్సరముల పాయుము వచ్చువఱకు తండ్రిగారిచేతనే సాహిత్య, సంపాదస మునందును, కవితా రచనా విధానములు, యందును శిక్షితుడై తండ్రికి చేతికందిన కొడుకై వర్దిల్లు చుండెను. సుకవి విద్యాభ్యాస సందర్బముసనుసరించి బాల భాస్కరకవి ప్రజ్నాది విశేషములు కొంతవఱకు వెల్లడింప నవ కాశము గలదు. సూరకవికి రమారమి యిరువదియైదు సంవత్సరములు - వయస్సు వచ్చువఱకు నీ భాస్కరకని జీవించి యుండును తండ్రి మరణముదనుక రేగడి విడచి సూరకవి వేఱొండు చోటునకువెళ్లుటలేదు అతని విద్యాభ్యాసమంతయు రేగడ యందే జరెగెను.అదియుం తండ్రి గారి వద్దనే.మా గ్రామమున మాతోబాటు పూర్వము నుండియు కాపురముండి యున్న వైధికులు, 'ఓరుగంటి ' వారి కుటుంబము ఒకటి కలదు. కాని విద్యాధికులగు పండితులుండి యుండిరన్న ప్రసిద్ధి యాకుటుంబమునకు లేదు ఆ హేతువు చేత