ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

అడదము సూరకవి.


చున్న వాడుక చొప్పున సూరకవి యఱువది మూడు సంవత్సరములు జీవించెనని తెలియవచ్చుటచేతను నతఁడు క్రీశ|| 1720 సంవత్సర ప్రాంతమున జన్మించి యుండెననుటకు వీలుకనఁబకు చున్నది.

సూరకవిగారి మనుమఁడగు సూరన 45 సంవత్సర ములు జీవించి, క్రిందటి చిత్రభాను సంవత్సరమునఁగాక యటు క్రిందటి చిత్రభానుసంవత్సర ఆషాఢ బహుళ పాడ్యమినాఁడు. (క్రీ శ 1 1828 సంవత్సరము) చనిపోయెను. దీనిని బట్టి యతఁడు క్రీ.! "వే || 1778 సంవత్సరమున జన్మించియుండవలెనని తేలు చున్నది. ఇతఁడు తనతండ్రిగారికి 28 సంవత్సరములు వయ స్సున జన్మించెను. అట్లయినచో సూరకవిగారి కుమారుఁడగు బాలభాస్కరుఁడు 1750 సంవత్సరప్రాంతమున జన్మించియుండ వలెను. సూరకవికి 25 సంవత్సరములకు మించిన ప్రాయమునందు సంతానము కలిగినట్లు వాడుక. ఈరీతిగ మాకుటుం బమునందుఁ దరముల వెంబడి వచ్చుచున్న సమాచారమునుబట్టి పరిశీలించి నను . సూరకవి 1720 సంవత్సర ప్రాంతమున " జన్మించియుం డవలెననియే తేలుచున్నది.

ఇంతియేగాక, బొబ్బిలి యుద్ధమున వీనస్వర్గమును గాంచిన " పెదవిజయరామ మహారాజుగారి కాలమున సూరకవి నిండుజవ్వనముననున్నవాటని యొక ప్రబలమగు వాడుక గలదు.