ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము,

7



అవధారు దేవ! . మహాప్రభూ! విన్న పంబాశ్రితోత్తముఁడ శుద్ధాంధకవిని పేరురామన యింటి , పేరడిదమువారు మాజాగ భూపాల రాజు రేగ ” అని రామకవి తన చెఱువు మీది పద్యములలో నొకదానియందిట్లు చెప్పియున్నాఁడు. వీరి కాలమునకుఁ దరువాత నీగ్రామము మునుపటి తావునుండి మార్పఁబడి యుత్తరముగా వేవొక స్థలమునఁ 'గట్టఁబడి యప్పటి గ్రామపు గుత్త దారుఁడగు దంతులూరీ అన్నమరాజు గారి పేరన అన్న మరాజు రేగ" యని వ్యవహరింపఁబడుచు వచ్చెను. భూపాలరాజు రేగ యను పేర నీగ్రామము రమారమి యెనుబది సంవత్సరములవఱకు నుండెననియుఁ బిదపఁగట్టఁబడిన గ్రామము అన్న మరాజు రేగ పేరట డెబ్బది సంవత్సరములకుఁ బై గానుండి ననియు నిప్పటిగ్రామమగు : పూసపాటి రేగ" "మొన్నపోయిన యానంద సంవత్సరమునఁ గాక క్రిందటి. యానంద సంవత్సర మునఁ బూర్వపుస్థలము నుండి యింకొక తావునకు మార్పఁబడి యచ్చటం గట్టఁబడెననియు, మాగ్రామములోని పెద్దలు చెప్పుచున్నారు. దీనినిఁబట్టి యిప్పటికి నూటముప్పది సంవత్సర ములక్రిందటి కాలముననున్న గ్రామము .భూపాలరాజు రేగయని తేలుచున్నది. క్రీ శ | 1780.90 సంవత్సర ప్రాంతము వఱకునుండి యున్న గ్రామము భూపాలరాజు రేగయని . వ్యవహరింపఁబడుచు వచ్చినందునను, మా కుటుంబమునందుఁ దరముల వెంబడి వచ్చు