ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

అడిదము సూరకవి.


పరాక్రమంబులకు "రాజెంతయు నాశ్చర్యమునొంది నీలాద్రి కవిని సుచిత రీతిని గౌరవింప సంకల్పించుకొనెను. కవియు నాయుద్దమునఁ దన యేలికగాంచిన విజయముసుగ్గడించుచు రణరంగ విజయమ !” ను పేర నొక యాంధ్ర ప్రబంధమును రచించి రాజు నకంకితమొన ర్చెను. నిండుకొల్వున రాజీ గ్రంథమును సాంతముగ విని యానందించి కవికి దవ్య రూపమగు పసదన మొసఁగుట యేగాక నీలాద్రి యుద్ధరంగమున వెల్లడించిన దైర్య సాహసము లకుఁదగిన పారితోషికమని యెంచి యొకకరవాలము (అడిదము) ను గానుకగా నొసంగి కవిని గౌరవించెను. నాఁటనుండియు నీ వంశజులకు (అడిదము' వారని యింటి పేరు గలిగెను.

మీఁదియంశములను - సప్రమాణముగఁ దెలుపుటకు దగిన యాధారములు గానరాకున్నను, సంప్రదాయసిద్ధముగ వచ్చుచున్న విషయములగుటచే నిందుఁబొందుపఱపఁ బడినవి. ఏదియెట్లున్నను బ్రకరణ ప్రారంభములో వాయఁబడిన "ఇరువదిమూడు పూరుషములు " అను సూరకవి చాటుపద్యమును బట్టి సూరకవికి ముందుఁ జాలతరములనుండి యీవంశజులు కవితా వృత్తి చే జీవించుచు వచ్చిరని 'చెప్పుట కేమెయు నాక్షేపణ ముండదు. మాగోత్రమును మోదుకూరివారి గోత్రమును. ససిస్టగోత మైన 'కారణ ముచేతఁ గొందొక కాలమున. నీయడిదము వారు మోదుకూరువారై యుండినను నుండవచ్చును.